టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు

టీడీపీ నుంచి వైసీపీలోకి భారీ చేరిక‌లు
  • వైసీపీతోనే సంక్షేమ పథకాలు అమలు
విజ‌య‌వాడ‌: వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ‌రామ్ దేవ‌మ‌ణి అర్బ‌న్ టీడీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు, భూత‌పాటి ఫ‌లోమెన్ అర్బ‌న్ టీఎన్టీయూసీ అధికార ప్ర‌తినిధి, శ్రీ‌రామ్ వింధ‌మ్ టీడీపీ యూత్ నాయ‌కులు, శ్రీ‌రామ్ స‌ర‌ళ‌రాణి టీడీపీ మ‌హిళా నాయ‌కురాలు త‌దిత‌రులు మంత్రి వెల్లంపల్లి సమక్షంలో వైసీపీలో చేరారు.

బుధ‌వారం బ్రహ్మాణ వీధిలోని దేవదాయ ధర్మధాయ శాఖ మంత్రి కార్యాలయంలో 35వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బ‌ల‌సాని కిర‌ణ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయ‌కులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Vellampalli Srinivasa Rao
Telugudesam
YSRCP

More Press News