Etela Rajender: కోవిడ్ తో చనిపోయిన డెప్యూటీ డీఎంహెచ్ఓ భార్యకు..
Add ap7am to your home Screen

కోవిడ్ తో చనిపోయిన డెప్యూటీ డీఎంహెచ్ఓ భార్యకు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం

కోవిడ్ తో చనిపోయిన డెప్యూటీ డీఎంహెచ్ఓ భార్యకు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం
హైదరాబాద్: కోవిడ్ తో చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం జీ.ఓ కాపీని అందించారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం కల్పించారు.

ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఈ ఉద్యోగం ఇప్పించారని, కష్ట పడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైద్య చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మానవతా కోణంలో ఆలోచించి తనకు గెజిటెడ్ ఉద్యోగం ఇచ్చినందుకు డాక్టర్ నరేష్ భార్య పావని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కి ధన్యవాదాలు తెలిపింది.

మంత్రిని కలిసిన వారిలో పావని తండ్రి సత్యనారాయణ, పిల్లలు సంజని, శరణితో పాటు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డా. కత్తి జనార్ధన్, సెక్రెటరీ జెనెరల్ డా. పూర్ణ చందర్, వైస్ ప్రెసిడెంట్ డా. రాంబాబు, సెక్రేటరీలు డా. ప్రవీణ్, డా. కిరణ్ లు ఉన్నారు.
Etela Rajender
Corona Virus
Telangana

Watch Today's Deals on Amazon

More Press News