అమెరికాలో యార్లగడ్డకు శస్త్ర చికిత్స

అమెరికాలో యార్లగడ్డకు శస్త్ర చికిత్స
  • విజయవంతంగా గుండెకు స్టంట్
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గుండె సంబంధిత శస్త్ర చికిత్స అనంతరం శుక్రవారం ఆసుప్రతి నుండి ఇంటికి చేరుకోనున్నారు. అమెరికాలోని తన కుమారుని వద్దకు వెళ్లిన యార్లగడ్డ అక్కడ అస్వస్ధతకు లోనయ్యారు. వైద్యులు నిర్వహించిన పరీక్షలలో గుండె కవాటాలు దెబ్బతిన్నట్టు గుర్తించారు. వెంటనే వైద్య ప్రక్రియ అవసరమని, తక్షణం స్టంట్ వేయవలసిన అవసరం ఉందని డాక్టర్లు సూచించటంతో యార్టగడ్డ శస్త్ర చికిత్స నిమిత్తం అక్కడి బాపిస్టు మెడికల్ సెంటర్ లో ప్రవేశం పొంది చికిత్స తీసుకున్నారు. వైద్య పరిభాషలో కొరనరీ యాంజియోప్లాస్టీగా ఈ చికిత్సను పేర్కొంటారు.

ఆసుపత్రి వైద్యులు యార్లగడ్డకు విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వైద్యులు సూచనలకు లోబడి ఫిభ్రవరి చివరి వారంలో యార్లగడ్డ ఇండియా చేరుకునే అవకాశం ఉంది. యార్లగడ్డ ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ ఛైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
yargadda
Amaravati
Andhra Pradesh

More Press News