బేగంపేటలో రాష్ట్రస్థాయి ఫోటో పోటీలలో ఎంపికైన విజేతలకు బహుమతుల ప్రధానం!

ఆగష్టు, 19న ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీన బేగంపేటలో గల ఐ.టి.సి. గ్రాండ్ కాకతీయ హోటల్ లో ఉదయం 10-30 గంటలకు రాష్ట్రస్థాయి ఫోటో పోటీలలో ఎంపికైన విజేతలకు బహుమతుల ప్రధానం చేయనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ రాష్ట్రస్థాయి ఫోటో పోటీలకు 104 మంది ఫోటో జర్నలిస్టులు 1124 ఫోటోలను ఎంట్రీ చేసుకోక జె ఎన్ టి యూ, ఓయూ జర్నలిస్ట్ ప్రొఫెసర్లతో పాటు, సీనియర్ జర్నలిస్టుల బృందంతో కూడిన జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. ఈ ఫోటోలను బంగారు తెలంగాణ, ఫోటో జర్నలిస్టు, సిటీ అభివృద్ది, తెలంగాణ పండుగలు అనే నాలుగు కేటగిరీలుగా వర్గీకరించామని, మొదటి బహుమతిగా రూ.25,000/-లు, రెండవ బహుమతిగా రూ.20,000/-లు, మూడవ బహుమతిగా రూ.15,000/-లు మరియు కన్సోలేషన్ బహుమతులుగా రూ.10,000/-లు, రూ.5,000/-ల రూపాయల నగదు పారితోషికం, ప్రశంసాపత్రంతోపాటు ఘనంగా సన్మానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రాష్ట్ర పశుసంవర్థక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి మరియు ప్రత్యక్ష ఆహ్వానితులుగా మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా  ఛాయా చిత్ర ప్రదర్శన ఉంటుందని ఆయన తెలిపారు.

More Press Releases