పట్టణాభివృద్ధిపై పార్లమెంటరీ కమిటీ సమావేశం

పట్టణాభివృద్ధిపై పార్లమెంటరీ కమిటీ సమావేశం
హైదరాబాద్, జనవరి 19: పట్టణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం నేడు నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్ ని సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించింది. జగదాంబిక పాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును విస్తృతంగా సమీక్షించారు.

ప్రధానంగా స్మార్ట్ సిటీ, అమృత్ ప్రాజెక్ట్, స్వచ్ఛ భరత్ మిషన్, స్ట్రీట్ వెండింగ్ పాలసీ అమలు,  ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పట్టణపేదరిక నిర్మూలన తదితర కార్యక్రమాల అమలును కమిటీ సమీక్షించింది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ సంచాలకులు సత్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.
Hyderabad
Telangana

More Press News