పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఒకే ఒక్క దరఖాస్తు చాలు: యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ లో ఏపీ సీఎం

Related image

అమెరికా రాజధాని వాషింగ్టన్‌డీసీలో యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్ధన్‌ ష్రింగ్లాతో సీఎం జగన్ సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. యూఎస్ - ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు.

పరిశ్రమలకు పెట్టాలనుకునేవారికి రెడ్‌టేపిజం అడ్డంకులు తమ ప్రభుత్వంలో ఉండబోవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే కేవలం ఒకే ఒక్క దరఖాస్తు నింపితే సరిపోతుందని, తన కార్యాలయమే దగ్గరుండి అన్ని పనులూ చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

More Press Releases