Somesh Kumar: ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత..
Add ap7am to your home Screen

ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత ఆదాయం సాధించేలా కృషి చేయండి: తెలంగాణ సీఎస్

ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత ఆదాయం సాధించేలా కృషి చేయండి: తెలంగాణ సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల ద్వారా మరింత ఆదాయం సాధించేలా వచ్చే 3 నెలలు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను కోరారు.

శనివారం బిఆర్ కెఆర్ భవన్ లో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ శాఖల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని  కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ ల ద్వారా ఆదాయ సాధనకు టీం వర్క్ తో కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలుపుతూ, రాబోయే రోజులలో అధికారులు మరింత కృషిచేసి రాష్ట్ర ఆర్ధిక పరిపుష్ఠికి పునరంకితులు కావాలని కోరారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో వివిధ క్యాటగిరీలలో 131 పోస్టులు మంజూరు, నూతనంగా 14 ఎక్సైజ్ స్టేషన్లు, కమర్షియల్ టాక్స్ శాఖలో 161 పోస్టులు, 18 నూతన సర్కిళ్ళు మంజూరు చేసిందని వివరించారు. ఈ శాఖల లో చాలా పోస్టులు అప్ గ్రేడ్ చేయటంవలన సిబ్బందికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.

శాఖల రీఆర్గనైజేషన్ వలన ఉద్యోగుల కేరీర్ లో పురోగతి ఉండటం తో పాటు విధుల నిర్వహణలో సంతృప్తికి అవకాశం కలుగుతుందన్నారు. ఈ శాఖల రీ ఆర్గనైజేషన్ వలన ఈ శాఖలలో పనిచేసే సిబ్బందికి ప్రమోషన్లు లభిస్తాయని అన్నారు. ప్రమోషన్లకు సంబంధించి ప్రాసెస్ ఇప్పటికే మొదలైందన్నారు. ఈ నూతన సంవత్సరంలో చాలామంది ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
Somesh Kumar
Telangana

Watch Today's Deals on Amazon

More Press News