ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రులు!

Related image

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా, మల్కాజిగిరిలో రూ.2.15 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి.

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్:

  • ఏజెన్సీలో గిరిజనులకు చాలా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మైదానం ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు జరిగే విధంగా సీఎం కేసిఆర్ గారిని కోరుతాను.
  • గతంలో గురుకులాలు చాలా తక్కువగా ఉంటే కేసిఆర్ గారు సీఎం అయ్యాక దేశంలో ఎక్కడా లేని విధంగా 1000కి పైగా గురుకులాలు పెట్టి అక్కడ నాణ్యమైన విద్య, సన్న బియ్యంతో పోషకాలతో కూడిన భోజనం, రోజు ఒక గుడ్డు, నెలకు 4సార్లు చికెన్, 2సార్లు మటన్, నెయ్యి, పాలు, పప్పులు, స్నాక్స్ అందిస్తున్నారు.
  • అదే విధంగా ఈ గురుకులాల్లో చదువుతున్న పిల్లలు కూడా అనేక ప్రవేశ పరీక్షల్లో తమ సత్తా చాటుకుంటూ అవకాశం కల్పిస్తే ఎవరికీ తాము తీసిపోమని నిరూపిస్తున్నారు.
  • గిరిజన బాలికలు ఇంటర్ తరవాత విద్య మానేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని వారి కోసం ఒకేసారి 22 గిరిజన డిగ్రీ గురుకుల విద్యాలయాలు పెట్టారు.
  • రాజేంద్ర నగర్ లో ఐఏఎస్ స్టడీ సర్కిల్ పెట్టి పోటీ పరీక్షలకు కోచింగ్ అందిస్తున్నారు. నీట్ పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
  • ఇతర దేశాల్లో చదువుకునేందుకు గతంలో 10 లక్షల రూపాయలను ఇస్తే దానిని పెంచి ఇప్పుడు 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు.
  • రాజకీయాల్లోకి కూడా గిరిజనులను తీసుకొచ్చేందుకు రిజర్వేషన్ పెట్టి, తండాలను గ్రామ పంచాయతీలు చేసి మా ప్రాంతాలను మేము పాలించుకునే అవకాశం కల్పించారు.
  • ఇంకా కూడా గిరిజనులు అభివృద్ధి చెందడానికి ఏమి చెయ్యాలో చెప్పండి అని ఎప్పటికీ అప్పుడు ప్రోత్సహిస్తున్నారు.
  • గిరిజనుల జనాభా ప్రాతిపదికన వారికి 10 శాతం బడ్జెట్ దాదాపు 10వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు.
  • ఇలాంటి సీఎం మనకు ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను.
  • గిరిజనులు ఇక్కడ కిరాయిలు నడిపిస్తూ ఇబ్బందులు పడుతున్నారని, డ్రైవర్ కమ్ ఓనర్ పథకం కింద వాహనాలు ఇస్తున్నాము.
మంత్రి చామకూర మల్లారెడ్డి కామెంట్స్:
  • గిరిజన బాలురకు మంచి వసతి భవనం నా నియోజకవర్గంలో ఏర్పాటు కావడం చాలా సంతోషం.
  • సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో గిరిజనులకు మేలు జరుగుతుంది. తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. స్వయం పాలన అందించారు.
  • పేద ప్రజలు పెద్ద చదువులు చదవాలని పెద్ద ఎత్తున గురుకులాలు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసిఆర్ గారిది.
  • ఒక్కొక్క పేద విద్యార్థిపై ఏటా లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్న గొప్ప సీఎం కేసిఆర్ గారు.
  • అదే విధంగా గిరిజన విద్యార్థులకు కూడా అన్ని వసతులు కల్పిస్తూ మంచి విద్యను అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దీపిక, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, జెడ్పీటీసీ లు, ఎంపీటీసీలు, సర్పంచులు, గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ ఇంజనీర్ శంకర్, ఈ.ఈ వసంత, ఇతర స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

More Press Releases