బ్యాంకర్లతో తెలంగాణ సీఎస్ సమావేశం

బ్యాంకర్లతో తెలంగాణ సీఎస్ సమావేశం
హైదరాబాద్: వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి వివరించడానికి, సందేహాల నివృత్తి నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో బ్యాంకింగ్ మరియు మార్ట్ గేజ్(mortgage) మాడ్యూల్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బ్యాంకర్లు ఈ ప్రకియను ప్రశంసిస్తూ వ్యవస్థలో మరింత పారదర్శకతను తెస్తుందన్నారు. రిజిస్ట్రేషన్ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖకు సహకరిస్తామని అన్నారు.

ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమీషనర్ మరియు ఇన్స్ పెక్టర్ జనరల్ శేషాద్రి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్పరాజ్ అహ్మద్, లా సెక్రటరీ సంతోష్ రెడ్డి, టి.ఎస్.టి.ఎస్.మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు, ఎస్.బి.ఐ జనరల్ మేనేజర్ మరియు ఎస్.ఎల్.బి.సి కన్వీనర్ కృష్ణన్ శర్మ, ఎస్.బి.ఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
Somesh Kumar
Telangana
Hyderabad

More Press News