Pawan Kalyan: మృతుల కుటుంబాలకు నాగబాబు ఆర్ధికసాయం!
Add ap7am to your home Screen

మృతుల కుటుంబాలకు నాగబాబు ఆర్ధికసాయం!

మృతుల కుటుంబాలకు నాగబాబు ఆర్ధికసాయం!
ప్ర‌మాదంలో మృతి చెందిన జ‌న‌సైనికుల కుటుంబాల‌కు నాగ‌బాబు ఆర్ధిక‌సాయం మ‌రో ల‌క్ష రూపాయిలు ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌ కల్యాణ్ తూర్పు గోదావ‌రి జిల్లా అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు సంవ‌త్స‌రాల క్రితం ఫ్లెక్సీలు క‌డుతూ ప్ర‌మాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు జంజం స‌తీష్‌(19), గుండార‌పు వీర‌బాబు(20)ల‌ కుటుంబాల‌కు జ‌న‌సేన పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హార‌ల క‌మిటీ స‌భ్యులు, ఉభ‌య గోదావ‌రి జిల్లాల ఇన్‌ఛార్జ్‌ నాగ‌బాబు రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సాయం అంద‌చేశారు.

ఈ ఇద్ద‌రు చేనేత కుటుంబానికి చెందిన వారు. ఈ దుర్ఘ‌ట‌న 2015లో జ‌ర‌గ్గా, నాగ‌బాబు తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విష‌యం ఆయ‌న దృష్టికి వ‌చ్చింది. వెంట‌నే స్పందించిన ఆయ‌న రాజ‌మండ్రిలో మృతి చెందిన కార్య‌క‌ర్త‌ల కుటుంబాలను క‌లిసి ఓదార్చారు. త‌నవంతుగా ఆర్ధిక సాయం అందించారు. జ‌న‌సేన పార్టీ ఆ కుటుంబాల‌కు అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ కుటుంబాల‌కు మ‌రో రూ. 50 వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్‌ కల్యాణ్ మంగ‌ళ‌గిరి కార్యాల‌యంలో బుధ‌వారం రాత్రి ప్ర‌క‌టించారు. త‌ర్వ‌లోనే ఈ మొత్తాన్ని వారికి అంద‌చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Pawan Kalyan
Jana Sena
nagababu
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News