నిర్మాణ వ్యర్థాలను తరలించే 50 కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

నిర్మాణ వ్యర్థాలను తరలించే 50 కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 11: హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన 50 కంప్యాక్టర్ వాహనాలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించనున్నారు. ఒకొక్కటి 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల ఈ వాహనాల ద్వారా 15 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించడం జరుగుతుంది. నెక్లస్ రోడ్ ఐమాక్స్ సమీపంలోని మైదానంలో ఈ వాహనాలను మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు మహ్మూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ లతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం సంజీవయ్య పార్కు వద్ద ఆధునీకరించిన ట్రాన్స్ ఫర్ స్టేషన్ ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.
KTR
Hyderabad
Telangana
waste compactor

More Press News