జాతీయ అవార్డు విజేతలకు పవన్ కల్యాణ్ అభినందనలు!

జాతీయ అవార్డు విజేతలకు పవన్ కల్యాణ్ అభినందనలు!
జాతీయ అవార్డు విజేతలకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. 'జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైన కీర్తి సురేష్ కి నా తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు. సావిత్రి గారి జీవితం ఆధారంగా వచ్చిన 'మహానటి'లో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి సురేష్ నటన అవార్డుకు అర్హమైనదే. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచినందున చిత్ర బృందానికి, రంగస్థలం, అ!, చి.ల.సౌ., చిత్రాలకు సాంకేతిక విభాగాల్లో అవార్డులకు ఎంపికైనవారికి అభినందనలు. ఏడు పురస్కారాలు దక్కించుకున్నందున ఈ స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని' పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.
National Film Awards
Pawan Kalyan
Jana Sena
Keerthy Suresh

More Press News