వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష

Related image

హుజురాబాద్, కరీంనగర్: ఈ రోజు హుజురాబాద్ క్యాంప్ ఆఫీస్ లో వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న వడ్లు వేసుకోమనిచెప్తే అందరూ రైతులు సన్న వడ్లను వేశారు. ఏప్రిల్ మే మాసంలో రాళ్ళ వర్షం వచ్చి పంటలు అన్ని కూడా భూమి పాలైతుందని సీజన్ ని ముందుకు జరపాలని భావించి రోహిణి కార్తీలొనే నాట్లు వేసుకోవాలని చెప్పినప్పుడు LMD కింద హుజురాబాద్ నియోజకవర్గంలో తొందరగా నాట్లు వేయడం జరిగింది.

మొత్తం తెలంగాణలో మొట్ట మొదట పంటలు చేతికివచ్చిన నియోజకవర్గం హుజురాబాద్, అందువల్ల ముఖ్యమంత్రి ప్రతి గింజను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో Ikp మహిళలు మేమె సెంటర్లు నడిపిస్తాం అని ముందుకు వస్తే అన్నిటికి పర్మిషన్ ఇచ్చి రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు వచ్చిన 24 గంటల్లో వడ్లు అమ్ముకునే పరిస్థితి ఉండాలని పిలుపు ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈ ప్రాంతంలో అన్ని ikp సెంటర్లు ఓపెన్ చేయడం జరిగిందని మంత్రి అన్నారు.

రేపటి నుండి ఈ ప్రాంతంలో అన్ని ikp సెంటర్ల వద్ద వడ్ల కొనుగోలు చేస్తున్నామని రైతాంగానికి తెలియచేస్తున్నాను, Ikp సెంటర్లు గతంలో చెర్ల శికల్లో ఉండేది అట్లాంటి గ్రామాల్లో ఆ సెంటర్లని వేరే ప్రాంతాలకు తరలించి సెంటర్లని రన్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. బాగా వర్షాలు పడి జాలు నీరు వస్తుంది కాబట్టి భూమి దిగబడుతుంది కాబట్టి, సెంటర్లకు కష్టం అవుతుంది కాబట్టి పెద్దరోడ్ల వద్ద వడ్లను ఆరబెట్టి వడ్లు తీసుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టాలని నిర్ణయించడం జరిగిందని మంత్రి అన్నారు.

ప్యాడి మిల్లుకు పోయిన వెంటనే అన్లోడ్ చేసుకొనే విధంగా కాంటాలు, హమాలీలను సిద్ధం చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగ రైసుమిల్లర్లు కూడా మా ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము వెంటనే కొనుగోలు చేస్తాం అని మిల్లర్లు మంత్రికి హామీ ఇచ్చారు.

More Press Releases