మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ సుదర్శన మహాయాగం

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ సుదర్శన మహాయాగం
  • లోక కళ్యాణార్థం మహా సుదర్శనయాగం
  • మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ముగిసిన శరన్నవరాత్రి పూజలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచన మేరకు దేశం, తెలుగు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి కలగాలని అమ్మవారికి మొక్కుతూ శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహించారు.

సనాతన ధర్మాన్ని పాటించి రక్షించే పవన్ కల్యాణ్ లాంటి నాయకునికి అన్నింటా విజయాలు సిద్ధించాలని, రాబోయే రోజుల్లో ఆయన పాలనలో అంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వదించారు. ఆదివారం.. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు దుర్గమ్మ విజయ స్వరూపిణి అయిన శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, వీరమహిళలు అమ్మవారిని దర్శించుకున్నారు. పార్టీ నాయకులు, జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

పార్టీ కార్యాలయ నిర్వాహకులు గోవిందు అంజిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, సెంట్రల్ ఆంధ్రా పార్లమెంట్ సంయుక్త కమిటీ సభ్యులు అమ్మిశెట్టి వాసు, పాకనాటి రమాదేవి, గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు కప్పెర కోటేశ్వరరావు, రావి సౌజన్య, కొత్తవారి శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.
Janasena
Pawan Kalyan

More Press News