మలక్ పేట ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి

మలక్ పేట ప్రాంతంలో పర్యటించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మలక్ పేట పరిసర ప్రాంతాలలోని శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్‌పురా మరియు మూసా నగర్ ప్రాంతాలలో గురువారం నాడు పర్యటించారు. బాధిత ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

దెబ్బతిన్న మరియు ప్రభావిత గృహాలను శుభ్రం చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎమ్‌డబ్ల్యుఎస్, అధికారులకు సూచించారు. ఏ పరిస్థితిలోనైనా ప్రజలకు సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల తదితరులు పాల్గొన్నారు.
Hyderabad
Md Mahamood Ali

More Press News