గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని GHMC కేంద్ర కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల ఓటరు నమోదును స్వయంగా వచ్చి నమోదు చేసుకున్నారు. ఓటర్ నమోదు అప్లికేషన్ ను హైదరాబాద్, రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ MLC ఎన్నికల ERO పంకజాకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  2017కు ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా షఫీయుద్దీన్, GHMC ఎలెక్ట్రోరల్ ఆఫీసర్ పంకజా, సిబ్బంది పాల్గొన్నారు.
V Srinivas Goud

More Press News