జూనియర్ డాక్టర్ల పై ప్రభుత్వ యంత్రాంగం తీరు బాధాకరం: పవన్ కల్యాణ్

జూనియర్ డాక్టర్ల పై ప్రభుత్వ యంత్రాంగం తీరు బాధాకరం: పవన్ కల్యాణ్
జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్.ఎమ్.సి) బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయి చేసుకోవడం బాధాకరం. ప్రతిభతో వైద్య విద్యను అభ్యసిస్తున్న యువతపై ఇలా చేయడం ప్రభుత్వ యంత్రాంగానికి తగదు. జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఎన్నో సేవలందిస్తున్నారు. వారి డిమాండ్ పై స్పందించకపోగా దాడి చేయడం సబబు కాదు. ఎన్.ఎమ్.సి. బిల్లు పట్ల జూనియర్ డాక్టర్లు, వైద్యులు ఆందోళన చేయడంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విజయవాడ, తిరుపతిల్లో చోటు చేసుకున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టి యువ వైద్యుల్లో, వైద్య విద్యార్థుల్లో స్థైర్యాన్ని నింపాలని పవన్ కల్యాణ్ ఓ ప్రకటన లో పేర్కొన్నారు.
Jana Sena
Pawan Kalyan
NMC Bill
Andhra Pradesh

More Press News