మంత్రి పదవికి మానవీయత జోడించిన గొప్ప నేత సుష్మా స్వరాజ్: పవన్ కల్యాణ్

మంత్రి పదవికి మానవీయత జోడించిన గొప్ప నేత సుష్మా స్వరాజ్: పవన్ కల్యాణ్
'సుష్మా స్వరాజ్ అకాల మరణం ఎంతో బాధాకరం. కేంద్ర మంత్రిగా, ఢిల్లీ ముఖ్యమంత్రిగా, పార్లమెంట్, శాసన సభ్యురాలిగా ఆమె దేశానికి చేసిన సేవలు అనన్య సామాన్యం. న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఆమె రాజకీయ నేతగా ఎదిగిన తీరు ఆదర్శవంతం. పార్లమెంటులో ఆమె చేసిన ప్రసంగాలు ఎదుటి పక్షంవారు కూడా మెచ్చుకునేరీతిలో ఉండడం ఆమె రాజకీయ పరిణితికి నిదర్శనం. విదేశాంగ మంత్రిగా ఆమె ఉన్న కాలంలో ప్రపంచంలో భారతీయులు ఏ చిన్న ఆపదలో చిక్కుకున్నా ఆమె స్పందించిన తీరు ఆమెలోని మానవీయతకు, భారతీయతకు అద్దం పడుతుంది. అటువంటి స్త్రీమూర్తి మన మధ్య నుంచి శాశ్వతంగా నిష్క్రమించడం ఎంతో విషాదకరం. ఈ సందర్భంగా ఆమెకు అంజలి ఘటిస్తూ నా తరపున, జనసేన పార్టీ తరపున సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నా' అని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.
sushmaswaraj
Pawan Kalyan
Jana Sena

More Press News