Somesh Kumar: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం..
Add ap7am to your home Screen

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ సీఎస్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ సీఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులందరు హెడ్ క్వార్టర్ లోనే ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని, సెలవు దినాలలో ఎటువంటి మినహాయింపు అనుమతులు ఇవ్వరాదని సీఎస్ అన్నారు.

లోతట్టు ప్రాంతాలు, వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూం కు పంపాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు.
Somesh Kumar

Watch Today's Deals on Amazon

More Press News