'గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ అంబులెన్స్‌ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Related image

  • గిఫ్ట్ ఏ స్మైల్ లో కార్య‌క్ర‌మంలో భాగంగా అంబులెన్స్ ల‌ను అంద‌జేసిన మంత్రి అల్లోల
హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 24: ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’ కార్యక్రమంలో భాగంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అంద‌జేసిన కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్స్ ల‌ను ఐటీ, మున్సిపల్ ‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వ్య‌క్తిగ‌తంగా త‌న స్వంత నిధుల‌తో 3 అంబులెన్స్ లను స‌మ‌కుర్చారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ -2, మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్ రావు-1 అంబులెన్స్ ను అంద‌జేశారు. అంబులెన్స్‌లను కొవిడ్‌ సహాయక చర్యలకుగానూ ప్రభుత్వానికి అందజేసిన వారికి కేటీఆర్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినోత్స‌వం సంద‌ర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా కరోనా బాధితుల కోసం కోవిడ్ రెస్పాన్స్  అంబులెన్స్ ల‌ను గిఫ్ట్ గా ఇచ్చామ‌న్నారు. నిర్మ‌ల్, మంచిర్యాల జిల్లాలోని క‌లెక్ట‌ర్ల ఆద్వ‌ర్యంలో ప్ర‌భుత్వ‌ వెద్య‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌లో ఈ అంబులెన్స్ ల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఈ వాహనాల్లో ఆక్సీజన్‌, వెంటిలేటర్‌తో సహా, అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. కరోనా బారిన పడిన సీరియస్‌ పెషెంట్లకు అవసరమైన సదుపాయాలన్నీ ఇందులో ఉన్నాయని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, మంచిర్యాల ఎమ్మెల్యే దివాక‌ర్ రావు, టీఆర్ఎస్ యువ‌జ‌న నాయ‌కులు అల్లోల గౌతంరెడ్డి, న‌డిపెల్లి విజిత్ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

KTR

More Press Releases