శ్రీశైల జలవిద్యుత్ కేంద్రం ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల శ్రద్ధాంజలి గీతం ఆవిష్కరణ

శ్రీశైల జలవిద్యుత్ కేంద్రం ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల శ్రద్ధాంజలి గీతం ఆవిష్కరణ
  • వెలుగులు పంచె సూర్యుళ్ల రా మసకబారితిరా
గత నెల ఇరవై తారీఖున శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రంలో సంభవించినటువంటి ప్రమాదంలో తొమ్మిది మంది విద్యుత్ ఉద్యోగులు  మరణించటం తెలిసిందే. మరణించిన ఉద్యోగులను స్మరిస్తూ పరికె.నాగభూషణం ట్రాన్స్కో విజిలెన్స్ సెంట్రల్ సర్కిల్ సి.ఐ రచించిన *వెలుగులు పంచే సూర్యుల్లార మసకబారితిరా* అనే శ్రద్ధాంజలి గీతాన్ని ఈ రోజు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టి.ఎస్.ఎస్.పి.డి.యల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కె. మురళీధరరావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కె ప్రభాకర్రెడ్డి, గీత రచయిత నాగభూషణం సి.ఐ, ఎస్ సంతోష్ కుమార్ ఎస్సై తదితరులు పాల్గొన్నారు.  
Telangana

More Press News