'బల్క్ పేమెంట్స్' సదుపాయాన్ని ఆవిష్కరించిన పేటీఎం!

Related image

  •  బహుళ బ్యాంక్ ఖాతాలకు తక్షణ డబ్బు బదిలీకి వీలుకల్పిస్తుంది
  • ఎస్‌ఎంఇ లకు మరియు పెద్ద వ్యాపారసంస్థలకు వ్యాపార లావాదేవీలను డిజైటైజ్ చేస్తుంది 
  • ఆర్థిక సంవత్సరం ’20 లో ఒక బిలియన్-డాలర్ విలువగల పంపిణీల ప్రక్రియ జరపడం లక్ష్యంగా కలిగి ఉంది
పేటిఎం పేమెంట్ గేట్‌వే (వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ద్వారా స్వంతంగా కలిగినది), వ్యాపారుల కోసం ’బల్క్ పేమెంట్స్’ సదుపాయ ఆవిష్కరణను ప్రకటించింది. ఈ సర్వీసు, పెద్ద, చిన్న వ్యాపారాలకు, వివిధ బ్యాంకుల యొక్క అనేక ఖాతాలకు డబ్బును ఒకేసారి పంపగలవిధంగా ఒకేరకంగా వీలుకల్పిస్తుంది. దీనితో, తన వెండార్స్, ఉద్యోగులు, వినియోగదరులు మరియు భాగస్వాములకు, బల్క్ చెల్లింపులు చేయు బి2బి మరియు బి2సి ప్లేయర్స్ కొరకు చెల్లింపులను సరళంగానూ మరియు డిజిటైజ్ చేయు లక్ష్యం కలిగి ఉంది.

ఈ సురక్షిత ఎపిఐ పరిష్కారం అనేది వివిధ వ్యాపారాలు మరియు వాటి నిర్దిష్ట ఆవశ్యకతల దృష్ట్యా అభివృద్ధి చేయబడింది. ఇది ఇదివరకే లబ్ధిదారు నిర్వహణ, పేరు ధృవీకరణ సేవ, బల్క్ పంపిణీ వంటి మాడ్యూల్స్ మొదలైనవాటికి వీలుకల్పిందించింది.

పేటిఎం పేమెంట్ గేట్‌వే, సులభంగ ఉపయోగించగల డ్యాష్ బోర్డ్ ను అందిస్తుంది, ఇది ఒక ఎపిఐ పరిష్కారం మరియు వ్యాపారి యొక్క ప్రస్తుత వ్యవస్థలతో సులభంగా సమగ్రపరచబడుతుంది. వ్యాపారాలను, బ్యాంక్ ఖాతా, యుపిఐ మరియు వాలెట్ లతో సహా, వివిధ గమ్యాలకు బదిలీ చేయడానికి ఎంచుకోవచ్చు. ఇంకా, వారు ఎంత మొత్తాన్నైనా వీలయినన్ని ఎక్కువ బ్యాంక్ ఖాతాలలోనికి పంపవచ్చు.

పునీత్ జైన్, వైస్ ప్రెసిడెంట్ – పేటిఎం పేమెంట్ గేట్‌వే, “వ్యాపారాల ద్వారా (బి2బి మరియు బి2సి రెండూ) , వేతనాలు, భర్తీలు, ప్రోత్సాహకాలు, తక్షణ తిరిగి చెల్లింపులు, గేమ్స్ గెలిచినదానికి బహుమతి మొత్తము, వెండార్ పేఅవుట్స్ మరియు భోజన అలవెన్సుల వంటి వాటికి క్రమవారీ చెల్లింపులు అనేక సంఖ్యలో ఉంటాయి. మేము ’బల్క్ పేమెంట్స్’ అనే ఒక వినూత్న ఉత్పాదనను ఆవిష్కరించాము, ఇది, వ్యాపారాలకు, ఈ చెల్లింపులను ఆటోమేట్ మరియు సెంట్రలైజ్ చేయడానికి వీలుకల్పించి, తద్వారా, నిర్వహించడానికి సంక్లిష్టంగా మరియు చిన్నచిన్న విభాగాలుగా ఉన్న పద్ధతిని, ఒక సమర్థవంతమైన మరియు డిజిటల్ పద్ధతిలో వారి వ్యాపార ఆర్థికతలను నిర్వహించడానికి వీలుకల్పిస్తుంది.” అని అన్నారు.

More Press Releases