ఉపాధ్యాయిల సహాకారంతోనే ప్రగతిశీల సమాజం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Related image

  • సర్వేపల్లి జన్మదినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయిలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
  • ఉపాధ్యాయిలు సమాజం యొక్క వాస్తుశిల్పులన్న బిశ్వ భూషణ్
  • నైతిక విలువలకు కట్టుబడిన మహనీయిడు డాక్టర్ సర్వేపల్లి : గవర్నర్
  • దేశ రెండవ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి సేవలు ఎంచదగినవన్న హరిచందన్
  • భారతావని నిర్మాణంలో ఉపాధ్యాయిల నిర్మాణం కీలకం: గవర్నర్
ఉపాధ్యాయులు సమాజం యొక్క వాస్తుశిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఉపాధ్యాయిల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నర్ హరిచందన్ ఒక సందేశంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయ సమాజానికి తన శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, భారత రెండవ రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలకు గౌరవార్థంగా, ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని బిశ్వ భూషణ్ ప్రస్తుతించారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన విద్యావేత్త, పండితునిగానే కాక తత్వవేత్తగా, రచయితగా భారత దేశానికి సేవలు అందించారన్నారు. సర్వేపల్లి తన జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టుబడిన మహనీయిడని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు. ఈ మేరకు రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

More Press Releases