ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి!

Related image

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిని అందించిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము - సీఎం కేసీఆర్

మహాకవి కాళోజి చెప్పినట్లుగా పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానిది అన్నట్లు జీవితాంతం తెలంగాణ కోసమే తపించిన మహా మనిషి. తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరుబాట చూపి బంగారు తెలంగాణకు మార్గ దర్శనం చేసిన మహాత్మా శ్రీ కొత్తపల్లి జయశంకర్ సారుకు నివాళులు - హరీశ్ రావు

జయ శంకర్ సార్ యాదిలో.. పుట్టుక మీది.. చావు మీది.. బతుకు తెలంగాణ ది.
To the man who struggled all his life for Telangana #Respect - కేటీఆర్

తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి ప్రజలకు విముక్తి పాఠాలు నేర్పిన మహోపాధ్యాయులు, ఆజన్మాంతం తెలంగాణనే  స్వప్నించి, శ్రమించిన కర్మయోగి తెలంగాణ దిక్సూచి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు. మహాత్మా మీరు చూపిన తోవలో తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు పునరంకితమవుతాం - కవిత కల్వకుంట్ల

తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ఊపిరి... మలిదశ ఉద్యమానికి మార్గదర్శి...తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము - ఈటల రాజేందర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత అభివృద్దిని నిత్యం స్వప్నించిన మేధో శ్రామికుడు ప్రొఫెసర్ జయశంకర్ - అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ 

తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించి, రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు, తెలంగాణ సిద్దాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సహకార సమాఖ్య ఛైర్మన్ లోకాభుమారెడ్డి, ఎం.డి శ్రీనివాస్, SPO మల్లయ్య, కార్మిక నాయకులు సాబీర్ పాషా, సాగర్, డైరీ అధికారులు పాల్గొని నివాళులు అరిపించారు

More Press Releases