కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తాం: హరీశ్ రావు

Related image

  • చింతమడకలో అటవీ అభివృద్ధి .. మినీ అర్బన్ పార్క్
  • ప్రజలకు ఆహ్లాదం... ఆరోగ్యం ఇచ్చే ఆక్సిజన్ పార్క్
  • స్మృతి వనం.. స్ఫూర్తి వనం ఏర్పాటు

సీఎం కేసీఆర్ ఆదేశాలతో చింతమడక అటవీ ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్ రావు, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్), అధికారులు:

పల్లెలు పచ్చదనంతో కళకళలాడాలి... ప్రజలకు ఆహ్లాదాన్ని... ఆరోగ్యాన్ని పంచాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అమలుచేస్తుంది. అదే విధంగా సీ.ఎం స్వగ్రామం చింతమడకలో ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. చింతమడక గ్రామంలో ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటించిన సందర్భంలో గ్రామ సమీపంలో ఉన్న 98 ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సూచించారని, సీఎం ఆదేశాలతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. శోభ, జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అటవీ ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ చింతమడక గ్రామంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో విరివిగా ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను నాటుతామని చెప్పారు. ఒక మినీ అర్బన్ ఫారెస్ట్ పార్క్ రూపొందిస్తామన్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా, పిల్లలు అడుకొనే విధంగా కొన్ని అడ్వెంచర్స్ స్పోర్ట్స్ కూడా అందుబాటులో కి తెస్తామని, సిద్దిపేట పట్టణములో ఉన్న స్మృతి వనం తరహాలో ఎవరైనా చనిపోతే వారికి గుర్తుగా వారిని స్మరించుకునే విధంగా, స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చింతమడక గ్రామాన్ని సందర్శించే ప్రముఖులు మొక్క నాటే విధంగా, గ్రామస్థులు పుట్టిన రోజున మొక్క నాటి స్పూర్తిని చాటుకొనే విధంగా స్పూర్తి వనం కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందులో ఉన్న చెరువును అభివృద్ధి చేసి మరింత సుందరీకరణగా చేస్తామని చింతమడక గ్రామంలో ఇదొక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో అర్బన్ పార్క్ గా అభివృద్ధి చేస్తున్న అటవీ ప్రాంతంలో ప్రజలు ప్రతినిత్యం వాకింగ్ చేసేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించే విధంగా చుట్టూ ఫెన్సింగ్  వేయాలని నిర్ణయించారు. మానవ మనుగడకు మొక్క నాటడం మన సామాజిక బాధ్యత అని, సీఎం స్వగ్రామం అభివృద్ధి కార్యక్రమాలకు రోల్ మోడల్ గా నిలిచేలా పనులు ఉండాలని నిర్ణయించారు.

ఒక వైపు ఆహ్లాదం..మరో వైపు ఆరోగ్యం ఇచ్చే విధంగా ప్రజలకు అందుబాటులో తెస్తామన్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని హరీష్ రావు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేశ్ జైస్వాల్, రాకేశ్ మోహన్ దోబ్రియాల్ మెదక్ చీఫ్ కన్జర్వేటర్  శరవణన్ ,  డీఎఫ్ ఓ శ్రీధర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

More Press Releases