శాసనసభ సమావేశ మందిరాన్ని పరిశీలించిన మంత్రి వేముల

శాసనసభ సమావేశ మందిరాన్ని పరిశీలించిన మంత్రి వేముల
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ఆదేశాల మేరకు మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరాన్ని,ప్రెస్, విజిటర్స్ గ్యాలరీని శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.

కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ సభ్యుల సీటింగ్ ఏర్పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అసెంబ్లీ సెక్రెటరీ నరసింహ చార్యులు, అధికారులతో మంత్రి సమాలోచనలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో కలిసి మంత్రి శాసనసభ నిర్వహణ ఏర్పాట్లపై సమావేశం కానున్నారు. ఏర్పాట్ల వివరాలు సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అనంతరం సమావేశాలు జరిగే తీరుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Hyderabad

More Press News