Etela Rajender: రైతాంగానికి పంట నష్టంపై ముఖ్యమంత్రి గారు నిర్ణయం..
Add ap7am to your home Screen

రైతాంగానికి పంట నష్టంపై ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు: మంత్రి ఈటల

రైతాంగానికి పంట నష్టంపై ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు: మంత్రి ఈటల
"ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన కరీంనగర్, వరంగల్.. కొన్ని ప్రాంతాల ఖమ్మం జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు కురిశాయి, ఈ వర్షాలతో వాగులు వంకలు పోగడమే కాకుండా చెరువులు నిండి ఉన్నాయి. చాలా గ్రామాలకు రవాణా సౌకర్యాలు బంద్ అయ్యాయి.  ఇంత పెద్ద ఎత్తున, ఇంత తక్కువ కాలంలో వర్షం పడటం అరుదుగా జరుగుతుంది. తెగిపోయిన చెరువులు, మునిగిపోయిన పంటపొలాలు, కూలిపోయిన ఇళ్ళ విషయంలో ఇప్పటికే  కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్, వ్యవసాయ ,రెవెన్యూ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన సంఘటన అన్నింటిని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయ చర్యలు సహాయ సహకారాలు అందిస్తాము. ఇప్పుడు వెంటనే ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ ఆహారాన్ని కావలసిన సహకారాలు అందిస్తాము. రైతాంగానికి పంట నష్టంపై ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారు" అని మంత్రి ఈటల వెల్లడించారు.

ఇంకా మంత్రి మాట్లాడుతూ.. "ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశాం. సిఎస్ గారి ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుంది. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి  ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారు. అవసరం ఉన్నచోట ప్రజలను షెల్టర్ లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. అధికారులకు తోడుగా ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగి సహాయం అందించాలి" అని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
Etela Rajender

Watch Today's Deals on Amazon

More Press News