వరదలు ఎక్కువతుండడంతో మరింత అప్రమత్తత అవసరం: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

  • ముంపు ప్రాంతాల ప్రజలను గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించండి
  • పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
  • ప్రమాదాల్లో చిక్కుకుంటే రక్షించడానికి సిద్ధంగా ఉండాలి
  • ములుగు జిల్లా కలెక్టర్ తో సమీక్ష చేసిన రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
వరుసగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఏజన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీలు ప్రమాదాల బారిన పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు చెప్పారు. కాళేశ్వరం గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో, వరుస వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగుతుండడంతో ములుగు జిల్లా కలెక్టర్ తో మంత్రి సత్యవతి రాథోడ్ ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని జనాలను దగ్గర్లో గల గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఎవరైనా వరదల్లో చిక్కుకున్నట్లు తెలిస్తే వెంటనే రిస్క్యూ చేసే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

More Press Releases