బస్తీదవాఖానల ఏర్పాటుతో పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: బస్తీదవాఖాన ల ఏర్పాటుతో పేద ప్రజలకు ఎంతో  ప్రయోజనం చేకూరుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ  శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట లో గల కమ్యునిటీ హాల్ లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ను జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి,  స్థానిక కార్పొరేటర్  అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీలలో నివసించే పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో బస్తీ దవాఖానా లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 170 బస్తీ దావఖానల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని, ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన మరో 25 బస్తీ దవాఖానా లను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, మేయర్ బొంతు రాంమోహన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వివిధ ప్రాంతాలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

బస్తీలలో నివసించే పేద ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకోలేక పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకే జీహెచ్ఎంసీ పరిధిలో 300 బస్తీ దావఖానలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారని, నేడు ప్రారంభించిన దవాఖానా లతో కలిపి మొత్తం 195 కు చేరిందని తెలిపారు. ప్రజల అవసరాలను బట్టి 300 కాకుండా మరిన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.

ప్రపంచ దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీ కాకుండా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో కూడా కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలు అభివృద్ధి చేసి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి.. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ బోయిగూడ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి తో కలిసి బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అనంతరం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్ పూర్, అడిక్ మెట్ లలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి మంత్రులు ప్రారంభించారు.

భోలక్ పూర్ లో దవాఖానా ప్రారంభించిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి నుండి గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ ఫౌండ్రీ డివిజన్ లో గల గడిఖానాలో ఏర్పాటు చేసిన బస్తీ దావఖాన ను స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తాలతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సెక్రెటరీ రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాస్ రావు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, DC ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases