స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖులతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ వివిధ రంగాలకు చెందిన కొందరు ప్రముఖ వ్యక్తులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు.

స్వాతంత్ర్య సమరయోధులు, భారత మిలిటరికి చెందిన ఆఫీసర్లు, రిటైర్డ్ సైనికులతో పాటు అమర జవాన్ల కుటుంబ సభ్యులు, సాహిత్యం, క్రీడలు, వైద్యం, ఇతర రంగాలకు చెందిన కొందరు ప్రముఖ వ్యక్తులతో శనివారం 3 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు పంచుకుంటారు. ఈ సమావేశం లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది.
Tamilisai Soundararajan

More Press News