ప్లాస్మాను దానం చేయటానికి ముందుకు రావాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపు

Related image

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ DONATE PLASMA - SAVE LIVES అనే క్యాప్షన్ తో అవని ఫౌండేషన్ కు చెందిన సత్తూర్ శిరీష మరియు వారి మిత్ర బృందం రూపొందించిన వాల్ పోస్టర్ ను హైదరాబాద్ లో రవీంద్రభారతి లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సత్తూర్ శిరీష మరియు వారి మిత్రులు చేస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాలను చేయడాన్ని ఈ సందర్భంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ కరోనాపై అవగాహన పెంచుకోవలన్నారు. కరోనా నియంత్రించుటకు నివారణ ఒక్కటే మార్గామన్నారు. కరోనా వైరస్ ను జయించిన వారు తమ ప్లాస్మాను దానం చేయడం వల్ల కరోనా వైరస్ బారిన పడిన బాధితులకు ప్రాణ దానం చేసినవారు అవుతారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ప్లాస్మా దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్లాస్మా దాతలు ప్లాస్మాను దానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా కరోనా వైరస్ తో పోరాడి చనిపోయిన వారి మృతదేహానికి అంత్యక్రియలు జరపడానికి వారి పిల్లలు, బంధువులు ముందుకు రావాలన్నారు. చనిపోయిన వ్యక్తి లో వైరస్ సుమారు 4 గంటలకంటే ఎక్కువ సేపు ఉండదన్నారు. అంత్యక్రియలలో పాల్గొనే వారు తప్పనిసరిగా PPE కిట్లు దరించాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించి సుమారు 5 నుండి 10 మంది వరకు PPE కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహించాలని మంత్రి సూచించారు. PPE ధరించడం వల్ల ఎలాంటి వైరస్ వ్యాపించదన్నారు. కరోనా బాధితులపై మానవత్వాన్ని చూపాలన్నారు.

 అంత్యక్రియలు చేయకుండా ఆసుపత్రిలో శవాన్ని వదిలి వెళ్లే వారు చేసే పనిని అమానుష చర్య గా అభివర్ణించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మానవత్వాన్ని మరచి మానవ మృగాలుగా నిలవొద్దన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, TNGO - EC సభ్యురాలు శైలజ మరియు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases