పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే తగు చర్యలు: మంత్రి పువ్వాడ

పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే తగు చర్యలు: మంత్రి పువ్వాడ
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. కొనసాగుతున్న అనేక అభివృద్ధి పనులపై మున్సిపల్ కమీషనర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల ఆలస్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే తగు చర్యలకు భాద్యులు కావాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించారు. కొనసాగుతున్న ఆయా పనులపై ఆయా కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారుల నుండి పనుల నివేదికను కోరాలని మంత్రి సూచించారు.

సకాలంలో పూర్తి చేయకపోతే చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా నగరంలోని NSP క్యాంప్ లోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రాంగణంలో రూ.23 లక్షలతో నిర్మించ తలపెట్టిన  వీధి వ్యాపారులకు దుకాణ సముదాయాల నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. ఆగస్ట్ 15 నాటికల్లా పూర్తి చేయాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతిని ఆదేశించారు. తర్వాత  గట్టయ్య సెంటర్ లో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ భవనంను సందర్శించారు. పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల ఆలస్యానికి కారణాలు చెప్తే సరిపోదని, నాకు పని కావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దసర నాటికి పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు.
Khammam District
Puvvada Ajay Kumar

More Press News