Pawan Kalyan: ఈనెల 4వ తేదీ నుంచి పవన్ కల్యాణ్..
Add ap7am to your home Screen

ఈనెల 4వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన!

ఈనెల 4వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ భీమవరం పర్యటన!
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. ఈ నెల 4 , 5 తేదీల్లో ముఖ్య నాయకులూ, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ పర్యటనలోనే క్యాన్సర్ తో కన్నుమూసిన జనసేన కార్యకర్త కొప్పినీడు మురళీకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 4 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి పవన్ కల్యాణ్ చేరుకొంటారు. అక్కడి నుంచి సిద్ధాంతం, పెనుగొండల మీదుగా భీమవరం చేరుకొంటారు. అదే రోజు సాయంత్రం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. 5 వ తేదీ ఉదయం 10 గంటలకు తాడేరుకు చెందిన పార్టీ కార్యకర్త కొప్పినీడు మురళీ కుటుంబాన్ని పరామర్శిస్తారు. 2 గంటలకు నరసాపురం పార్లమెంటరీ పరిధిలోని కార్యకర్తలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh

Watch Today's Deals on Amazon

More Press News