పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలకై ప్రత్యేక వెబ్ సైట్

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలకై ప్రత్యేక వెబ్ సైట్
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె. కేశవరావు, కమిటీ సభ్యుల సమక్షంలో జయంతి ఉత్సవాలకు సంబంధించిన సమాచారం, వివరాలు పొందుపరచడానికి, ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఒక ప్రత్యేక వెబ్ సైట్ https://pvnr.telangana.gov.in ను రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు మాజీ ప్రధాని, తెలంగాణ ఠీవి పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే.

పీవీ నరసింహా రావు శతజయంతి ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలు, కార్య స్థలాలు, ఆన్ లైన్ దరఖాస్తు ఫారాలు, ఫోటోలు, వీడియోలు, కమిటీ సమావేశాలు, సోషల్ మీడియా అక్కౌంట్లు, వార్తలు, విశ్లేషణలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నిర్ణయాలు వంటి సమాచారం ఈ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు.
KCR
Telangana

More Press News