Indrakaran Reddy: బోనాల ఉత్స‌వాలు నిరాడంబ‌రంగా జరిగేందుకు స‌హాక‌రించిన ప్ర‌తీ..
Add ap7am to your home Screen

బోనాల ఉత్స‌వాలు నిరాడంబ‌రంగా జరిగేందుకు స‌హాక‌రించిన ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు: తెలంగాణ మంత్రి

బోనాల ఉత్స‌వాలు నిరాడంబ‌రంగా జరిగేందుకు స‌హాక‌రించిన ప్ర‌తీ ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు: తెలంగాణ మంత్రి
హైద‌రాబాద్, జూలై 21:బోనాల ఉత్సవాలు నిరాడంబ‌రంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి  దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తల్లుల ఆశీర్వాదంతో ఈ  బోనాలు ప్రశాంతంగా విజయవంతమ‌య్యాయ‌ని, సహకరించిన భక్తులు, అధికారులు, సిబ్బంది అందరికీ మంత్రి మంగళవారం నాడు ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. క‌రోనా మ‌హ్మ‌మ్మారి నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ‌ప‌డేలా చూడాల‌ని, ప్ర‌జ‌లంద‌రిపై ఆశీర్వాదం ఉండేలా చూడాల‌ని అమ్మ‌వారిని ప్రార్థించారు. బోనాల వేడుక‌ల‌ను ప్ర‌తిసారీ అంగ‌రంగ వైభ‌‌వంగా నిర్వ‌హించేవార‌మ‌ని క‌రోనా క్ర‌మంలో బోనాలు సంద‌డి లేకుండానే జ‌రిగాయ‌న్నారు. ఆల‌య పూజారులు, సిబ్బంది మాత్ర‌మే అమ్మవార్ల‌కు బోనం స‌మ‌ర్పించి, పూజ‌లు నిర్వ‌హించార‌ని వెల్ల‌డించారు. భ‌క్తులు కూడా ఇండ్ల‌లోనే బోనం స‌మ‌ర్పించి పూర్తిగా స‌హాక‌రించార‌న్నారు.
Indrakaran Reddy

Watch Today's Deals on Amazon

More Press News