విద్యుత్ బకాయిల బిల్లులను చెల్లింపు చేయడానికి తగు చర్యలు తీసుకోండి: అధికారులకు తెలంగాణ సీఎస్ ఆదేశం

Related image

రాష్ట్రంలో వివిధ శాఖలలో పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిల బిల్లులను చెల్లింపు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో  వివిధ శాఖల విద్యుత్ బకాయిలపై సి.యస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, శాంతి కుమారి, అధర్ సిన్హా, ట్రాన్స్ కో CMD ప్రభాకర్ రావు, ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, రాజీవ్ త్రివేది, జగధీశ్వర్ కార్యదర్శులు బి.వెంకటేశం, జనార్ధన్ రెడ్డి, మహేశ్ దత్ ఎక్కా ప్రొటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారు విద్యుత్ శాఖపై సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారని వివిధ శాఖలు తమకు సంబంధించిన పెండింగ్ బిల్లులపై దృష్టి సారించి చెల్లింపులకు చర్యలు తీసుకోవాలన్నారు. తమ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు తో పాటు పొదుపుకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కార్యాలయాల్లో నాన్ కన్వెన్షన్ ఎనర్జీ ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని టిఎస్ రెడ్ కో ద్వారా సోలార్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను అన్ని శాఖలకు పంపాలని ఆదేశించారు.

More Press Releases