యాదాద్రిలో అందుబాటులోకి రెండు అర్బన్ ఫారెస్ట్ పార్కులు

Related image

  • యాదాద్రి  క్షేత్రంలో ఆధ్యాత్మికతకు  తోడైన  ఆహ్లాదకర వాతావరణం
  • ఆంజనేయ, నర్సింహా అరణ్యం అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్
  • హరితోద్యమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
యాదాద్రి - భువనగిరి జిల్లా రాయిగిరి లో ఆంజనేయ అరణ్యం, నర్సింహా అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఆంజనేయ అరణ్యంలో కాలి నడకన తిరుగుతూ.. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, పునరుద్ధరించిన అటవీ ప్రాంతాన్ని వ్యూ పాయింట్ నుంచి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యతను కాపాడ‌వ‌చ్చ‌నే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ‌కు హ‌రిత‌హారం అనే మహోత్తర కార్యక్రమాన్ని చేప‌ట్టారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హరితోద్యమ కార్యక్రమాన్ని చేపట్టారని, దీని వల్ల రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు.

హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు అడవులను కాపాడుకునేందుకు అత్యంత క‌ఠినంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా హైద‌రాబాద్ న‌లువైపులా, ఇత‌ర ప‌ట్ట‌ణాల‌కు దగ్గర్లో ఉండే అటవీ భూములను గుర్తించి వాటిల్లో కొంత భాగాన్ని అర్బన్ లంగ్‌ స్పేస్‌లుగా, అర్బ‌న్ ఫారెస్ట్ పార్కు లు, ఎకో టూరిజం పార్కుల‌ను ప్ర‌భుత్వం అభివృద్ది చేస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రీశుడి క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుండ‌టంతో ఇక్క‌డికి వ‌చ్చే యాత్రికుల‌‌తో పాటు ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించాల‌నే ఉద్దేశ్యంతో రాయ‌గిరి రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో న‌ర్సింహా అర‌ణ్యం, అంజ‌నేయ అర‌ణ్యం అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌ను అభివృద్ది చేయడం జరిగిందన్నారు. అంత‌రించిపోతున్న అడ‌వుల‌ను ప‌రిర‌క్షించడం, క్షీణించిన అడ‌వుల‌ పునరుజ్జీవన ‌చ‌ర్య‌ల్లో భాగంగా అటవీ శాఖ న‌ర్సింహా అర‌ణ్యం, అంజ‌నేయ అర‌ణ్యం ఎకో టూరిజం పార్కులను ఏర్పాటు చేసిందన్నారు.

గతంలో  రాళ్ళు, రప్పలతో ఉన్న ప్రాంతం ఇవాళ పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిందని చెప్పారు. రాయ‌గిరి - II రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో 97.12 హెక్టార్ల‌లో రూ.3.61 కోట్ల వ్యయంతో న‌ర్సింహా అర‌ణ్యం, రాయ‌గిరి -I ‌రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో 56.65 హెక్టార్ల‌లో రూ.2.83 కోట్ల వ్యయంతో అంజ‌నేయ‌ అర‌ణ్యం అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారన్నారు. పిల్లలు పర్యావరణం, అడవుల ప్రాధాన్యతను గుర్తించేలా, వీటిపై అవగాహన కల్పించేలా ఈ పార్కులను రూపుదిద్దారని తెలిపారు. ఆంజనేయ అరణ్యంలోని జలపాతానికి యాదమునికి గుర్తుగా యాదాశ్రీ అని పేరు పెట్టినట్లు వివరించారు. రెండు పార్కుల్లోనూ నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అటవీ శాఖ అధికారులు మంత్రికి వివరించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్. శోభ, అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, చంద్రశేఖర్ రెడ్డి, డీ ఎఫ్ వో డీవీ రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

*భువ‌నగిరి జిల్లా అట‌వీ శాఖ కార్యాల‌య‌ కాంప్లెక్స్ ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి*

కొత్త‌గా ఏర్ప‌డ్డ  యాదాద్రి- భువ‌న‌గిరి జిల్లాలో రూ.1.50 కోట్ల అంచ‌నా వ్య‌యంతో రెండెక‌రాల స్థ‌లంలో నిర్మించనున్న జిల్లా అట‌వీ శాఖ కాంప్లెక్స్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమి పూజ చేశారు. అటవీ శాఖ కాంప్లెక్స్ లోనే నర్సరీని ఏర్పాటు చేయనున్నారు.

*ఇవాళ ప్రారంభమైన నర్సింహా అరణ్యం, అంజ‌నేయ అరణ్యం అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్స్ ల ప్రత్యేకతలు*

రాయ‌గిరి - II రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో ఉన్న యాదాద్రి టెంపుల్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీ రేంజ్ ను న‌ర్సింహా అర‌ణ్యంగా పిలుస్తున్నారు.  

రాయ‌గిరి - II రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో 4 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో 97.12 హెక్టార్ల‌లో రూ.3.61 కోట్ల వ్యయంతో న‌ర్సింహా అర‌ణ్యం, రాయ‌గిరి -I ‌రిజ‌ర్వు ఫారెస్ట్ బ్లాక్ లో 3.6 కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో 56.65 హెక్టార్ల‌లో రూ.2.83 కోట్ల వ్యయంతో అంజ‌నేయ‌ అర‌ణ్యం అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల‌ను స‌ర్వాంగ సుంద‌రంగా రూపొందించారు.

యాదాద్రీశుడి క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుండ‌టంతో ఈ ఇక్క‌డికి వ‌చ్చే యాంత్రికుల‌‌తో పాటు ఈ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని అందించాల‌నే ఉద్దేశ్యంతో రాయ‌గిరి రిజ‌ర్వు ఫారెస్ట్ ఏరియాలో న‌ర్సింహా అర‌ణ్యం, అంజ‌నేయ అర‌ణ్యం అర్బ‌న్ ఫారెస్ట్ పార్క్ ల‌ను అభివృద్ది ప‌ర‌చ‌డమైన‌ది.

అంత‌రించిపోతున్న అడ‌వుల‌ను ప‌రిర‌క్షిండ‌టం, క్షీణించిన అడ‌వుల‌ పునరుజ్జీవన ‌చ‌ర్య‌ల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం న‌ర్సింహా అర‌ణ్యం, అంజ‌నేయ అర‌ణ్యం ఎకో టూరిజం పార్కును ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదించ‌డ‌మైన‌ది.

వినూత్న పద్ధతిలో అటవీ భూముల సంరక్షణ, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు యాత్రికుల‌ను ఆక‌ట్టుకునేలా ఆహ్లాదకరంగా, అందంగా అర్బన్ ఫారెస్ట్ పార్కుల‌ను తీర్చిదిద్దారు. నేచ‌ర్ థీమ్ తో న‌ర్సింహా, అంజ‌నేయ‌ అర‌ణ్యంల‌ ఎంట్రీ ప్లాజా ను ఏర్పాటు చేశారు. ప్ర‌కృతి, జీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ గురించి ఆసక్తిని కలిగించేలా ఈ పార్కుల‌ను రూపుదిద్దారు. ఎకో టూరిజం ప్ర‌మోష‌న్స్ భాగంగా ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం, జీవావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ ప్రాధ‌న్య‌త, వీటి ప‌ట్ల అవ‌గాహన క‌ల్పించేందుకు ఎకో టూరిజం ప్ర‌మోష‌న్స్ లో భాగంగా విజిట‌ర్ జోన్ ను తీర్చిదిద్దారు.

న‌ర్సింహా అర‌ణ్యం  పార్కులో అవెన్యూ ప్లాంటేష‌న్ తో కూడిన వాకింగ్ ట్రాక్స్, ఏనిమ‌ల్ డెన్స్, సాక్రేడ్ ఏనిమ‌ల్స్, వ్యూ పాయింట్స్, గ‌జీబో, హంపిథియేటర్, డీయ‌ర్ (Deer) రెస్క్యూ సెంట‌ర్, ఎంట్రీ ప్లాజా,నేచ‌ర్ ట్ర‌య‌ల్స్ టు ద టెంపుల్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్, పార్కింగ్ ఏరియా, రాక్ గార్డెన్, సీటింగ్ లొకేస‌న్స్, ప్లాంటేష‌న్, ఫెన్సింగ్, వాష్ రూంల‌ను ఏర్పాటు చేశారు.  

అంజ‌నేయ అర‌ణ్యంలో గ‌జీబో, వాకింగ్ ట్రాక్స్, థీమ్ పార్క్స్, సెల్ఫీ పాయింట్, వాట‌ర్ ఫాల్, రాక్ గార్డెన్స్, బ‌హుబ‌లి వాచ్ ట‌వ‌ర్, వాక్ ఓవ‌ర్ బ్రిడ్జెస్, నేచ‌ర్ ట్రయ‌ల్స్, సీటింగ్ బెంచెస్ ను ఏర్పాటు చేశారు.

అరుదైన మొక్కలు, మెడిస‌న‌ల్ ప్లాంట్స్, వివిధ ర‌కాల పూల మొక్క‌ల‌తో సంద‌ర్శ‌కుల‌కు ఆహ్లాదాన్ని అందించేలా అద్భుతంగా వీటిని అభివృద్ధి పరిచారు. కుటుంబ స‌భ్యుల‌తో సరదాగా గడిపేలా అందరికీ ఆహ్లాదాన్ని అందించేలా ఈ పార్క్ ల‌ను అభివృద్ధి చేశారు.

More Press Releases