హాకీ క్రీడా అభివృద్ధిపై తెలంగాణ మంత్రి ఉన్నత స్థాయి సమావేశం

Related image

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన  రాష్ట్రంలో హాకీ క్రీడా అభివృద్ధి పై తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు కల్పన తో క్రీడల అభివృద్ధి కి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ అభివృద్ధి చెయ్యడమే మా ప్రభుత్వ లక్ష్యం మన్నారు. హాకీ అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ సిటిలో హాకి లీగ్స్ ను ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు.  జిల్లాలో హాకీ క్రీడాకారులతో కమిటీ వేస్తే హాకీ అభివృద్ధి చెందుతుందన్నారు.
 
అస్తవ్యస్తంగా వున్న తెలంగాణ హాకి అసోసియేషన్ ను 5 మెన్ కమిటీ ని నియమించి సరిదిద్దాలని మంత్రి సూచించారు. ఈ 5 మెన్ కమిటీతో రాష్ట్రంలో వున్న 33 జిల్లాలో హాకి కమిటీ లను వేయాలని మంత్రి అసోసియేషన్ అద్యక్షుడు సరళ్ తల్వార్  ను ఈ సమావేశంలో ఆదేశించారు.
 
రాష్ట్రంలో హాకీ టౌర్నమెంట్ ల నిర్వాహణ ను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని మంత్రి ఈ సమావేశంలో హాకీ అసోసియేషన్ ను ఆదేశించారు. హాకీ అభివృద్ధి కి కృషి చేస్తామన్నారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షులు తల్వార్ వెంటనే 5గురు సభ్యుల తో ఉన్నత కమిటీ ని నియమించి, వారిచే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో హాకీ అసోసియేషన్ కమిటీ లను నియమించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని క్రీడల అభివృద్ధి కి పెద్ద పీట వేస్తున్నామన్నారు.
 
మన రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు  ఉన్నారు కానీ గతంలో వారికి ప్రోత్సాహకం లేక వెనకపడ్డారు. క్రీడల వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు.  యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
 
ఈ సమావేశంలో MLC కర్నె ప్రభాకర్, TSIIC ఛైర్మన్ బాలమల్లు, స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షులు తల్వార్ మరియు కార్యవర్గ సభ్యులు, మరియు మాజీ APTS డైరెక్టర్ ముప్పిడి గోపాల్ మరియు వివిధ జిల్లాల హాకీ అసోసియేషన్ కార్యదర్శులు  పాల్గొన్నారు.

More Press Releases