తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు: మంత్రి హరీశ్ రావు

Related image

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో హరిత హారం కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్:

  • సంగారెడ్డి జిల్లాలో హరిత హారం అద్భతంగా జరుగుతుంది.
  • ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, సర్పంచులు ఉద్యమంలాగా హరిత హారాన్ని అమలు చేస్తున్నారు. బాగా పని చేస్తున్నారు.
  • ఇస్లాంపూర్ లో  రెండున్నర ఎకరాల్లో మొక్కలు నాటడం జరిగింది. వేలాది మొక్కలు నాటడం జరిగింది.
  • వాటిని సంరక్షించడం ముఖ్యం.
  • తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ పని చేస్తున్నారు.
  • ఆయన నాయకత్వంలో అందరం పెద్ద ఎత్తున చెట్లు పెట్టి వానాలు వచ్చే విధంగా పని చేయాలి.
  • ఎంత చెట్లు పెడితే అంత వర్షం వస్తుంది. పంటలు చక్కగా పండుతాయి. వాతావరణం చల్లబడుతుంది.
  • ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావించవద్దు. మన సొంత పనిలా హరిత హారం చేపట్టాలి.
  • హరిత వనాలు విస్తరింపజేయండి. పొలం గట్ల మీద చెట్లు పెట్టండి. హరిత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలి.
  • కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం ప్రతీ రైతుకు రైతు బంధుసాయం అందించారు. ప్రతీ ఎకరానికి 5 వేల చొప్పున నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి రైతు బందు కింద వందకోట్లు ఇచ్చారు.
  • రాష్ట్రంలో కోటీ 37 లక్షల ఎకరాలకు 6 వేల 888 కోట్ల 43 లక్షల రూపాయలు మూడు రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేశాం.
  • దారిలో వచ్చేటప్పుడు బ్యాంకు వద్ద ఆగితే రైతులు రైతు బంధు డబ్బులు తీసుకుంటున్నారు.
  • అందరూ బ్యాంకులవద్దకు వెళ్లకండి. కరోనా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • మాస్క్ పెట్టుకొనే బ్యాంకుల వద్దకు వెళ్లండి. ప్రతీ రైతుకు, ప్రతీ ఎకరానికి రైతు బంధు డబ్బులు చెల్లించారు.
  • ఎవరికైనా ఒకరికి రాకపోతే వ్యవసాయ విస్తరణ అధికారులను కలవండి.
  • ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాం. 24 గంటల కరెంట్ ఇస్లాంపూర్లో అందుబాటులో ఉంది.
  • మీపంటలన్నీ కొంటున్నాం. రైతునురాజు చేసే లక్ష్యంతో సీఎంగారు పనిచేస్తున్నారు.
  • స్మశాన వాటికకు ఇస్లాంపూర్ లో కేటాయిస్తాం. నిధులు ఇస్తాం.
  • అల్లాదూర్గ మండలలో ఐ బి తండా లో బ్యాంకు వున్న రైతులతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.
  • రైతు బంధు డబ్బులు వచ్చాయా అని అరా తీశారు.
  • ఎం పంట వేశారు అని రైతు లను అడిగి తెలుసుకున్నారు.
  • ప్రభుత్వం చూపిన పంట వేస్తున్నాం అని తెలిపారు.

More Press Releases