రైతు సంక్షేమానికి అండగా ఉంటాం.. వినోద్ కుమార్ తో నాబార్డు చైర్మన్ గోవిందరాజులు

Related image

  • వినోద్ కుమార్ తో నాబార్డు సీజీఎం కృష్ణారావు భేటీ
తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమ కార్యక్రమాలకు అండగా ఉంటామని, అందు కోసం తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తామని నాబార్డు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ మంగళవారం నాబార్డు చైర్మన్ గోవిందరాజులుతో ఫోన్ లో మాట్లాడారు.

రైతుల సంక్షేమం కోసం అన్ని రకాల ఆర్థిక సహకారాన్ని అందించేందుకు నాబార్డు సిద్ధంగా ఉందని గోవిందరాజులు తెలిపారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అందు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ప్రతిపాదనను బట్టి ముందుకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారని వినోద్ కుమార్ కు తెలిపారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని అనుకుంటున్నట్లు తన అభిమాతాన్ని గోవిందరాజులు వ్యక్తం చేశారు. కాగా.. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ వై.కృష్ణారావు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.

మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ అధికార నివాసంలో వినోద్ కుమార్ తో భేటీ అయిన సందర్భంగా రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. రైతు బంధు (పూర్వపు రైతు సమన్వయ సమితి), రైతు బీమా, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్( ఎఫ్ బీ ఓ ) పనితీరు అత్భుతంగా ఉన్నాయని కృష్ణారావు అన్నారు. కొవిడ్ నేపథ్యంలో రైతుల ముంగిటనే రూ. 20 వేల కోట్లతో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడం చారిత్రాత్మకమని నాబార్డు బృందం కొనియాడింది.

More Press Releases