రోడ్డు ప్రమాద సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

రోడ్డు ప్రమాద సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్
  • మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపిన హరిచందన్
విజయవాడ, జూన్ 17: కృష్ణ జిల్లా జగ్గయపేట మండలం వేదాద్రి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్రాక్టర్ లారీని ఢీ కోన్న ఈ సంఘటనలో 10 మంది యాత్రికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. వారు సమీపంలోని ఆలయ దర్శనానికి వెళ్లి, తిరిగి వస్తున్న తరుణంలో లారీ ఢీ కొట్టింది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ హరిచందన్ ప్రగాడ సానుభూతి, హృదయపూర్వక సంతాపం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Watch Today's Deals on Amazon

More Press News