నరేగా పథకంకి అనుసంధానం చేయడానికి గల అంశాలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా

Related image

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు R&B డిపార్ట్మెంట్ లో మనుషులను ఉపయోగించి చేపట్టబోయే పనులను NREGS(నరేగా పథకం) కి అనుసంధానం చేయడానికి గల అంశాలపై ఎర్రమంజిల్ లోని ఆర్.అండ్.బి కేంద్ర కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... "మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 27,000 కి.మీ రాష్ట్ర రహదారులు, 1300 కి.మీ రాష్ట్రం ఆధీనంలో కల నేషనల్ హైవే (NH) రోడ్లు ఉన్నాయి. మొత్తం 27,000 కి.మీ రోడ్లలో నిర్మాణంలో ఉన్నాయి. డిఫెక్టివ్ లయబిలిటీలో ఉన్నాయి. మరియు మెంటనెన్స్ స్కీం లో ఉన్నయి పోను దాదాపు 1300 కి.మీ రోడ్ల ఇరువైపులా గల బుష్ క్లియరెన్స్ చేయడం మరియు రోడ్డుకు ఇరువైపుల కల షోల్డర్స్ ని మట్టితో లెవల్ చేయడం వంటివి మిషనరీ సహాయం లేకుండా మానవ ఆదారితంగా చేయగలిగే పనులు ప్రతిపాదించాలి" అని అధికారులను మంత్రి ఆదేశించారు.

అలాగే వాహనదారులకు కి.మీటర్ల దూరాన్ని చూపించే  స్టోన్ లకు పెయింటింగ్ వేయడం,కల్వర్టులు మరియు బ్రిడ్జ్ ఘాట్ స్టోన్స్ కు సున్నం వేయడం వంటి మెంటనెన్స్ పనులను కుడా ప్రతిపాదించాలని అధికారులకు మంత్రి సూచించారు.

"ముఖ్యంగా రైల్వే లెవల్ క్రాసింగ్ దగ్గర ఉన్న జంక్షన్ లలో నాలుగు వైపులా ఎప్పటికప్పుడు బుష్ క్లియరెన్స్,షోల్డర్స్ లెవలింగ్,పెయింటింగ్ వంటి పనులు కుడా NREGS కి అనుసంధానం చేసి రోడ్ సేఫ్టీకి దోహదపడే విధంగా పనులు చేయాలి.ఇలా మొత్తంగా ఈ సంవత్సరం R&B రోడ్ మెంటనెన్స్ లో దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే పనులను NREGS కి అనుసంధానం చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్ లకు వెంటనే ప్రతిపాదనలు పంపాలి"అని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ,ఈఎన్సీలు గణపతి రెడ్డి,రవీందర్ రావు,సీఈ సతీష్,సీఈ అడ్మిన్ ఆశారాణి, ఎస్.ఈ ఎన్. హెచ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases