సెప్టెంబర్ 19నుండి అక్టోబర్ 20వరకు '5వ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2019'..: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

తెలంగాణ పర్యాటక శాఖ గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్" దక్షిణాసియాలోనే నెంబర్ వన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ గా నిలిచి, ఐదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ - 2019 ను నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

5వ ఎడిషన్ ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్ – 2019 నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సచివాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డా. కె. లక్ష్మి, ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్ డైరెక్టర్ ఆక్వీన్ మాథ్యూస్ తో కలిసి మంత్రి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో సమర్థవంతంగా ప్రభుత్వంలోని పలు శాఖల అభివృద్ధికి బాటల వల్ల తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించాము. అందులో భాగంగా స్వదేశీ, విదేశీ పర్యాటకులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ఇలాంటి ఫోటోగ్రఫీ ఫెస్టివల్స్ ను రూపకల్పన చేయడం జరిగిందన్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మాదాపూర్ లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో నిర్వహిస్తున్న 5వ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2019 ను సెప్టెంబర్ 19 నుండి  అక్టోబర్ 20 వరకు జరుగుతుంది. ఈ ఫెస్టివల్ ను 131 సంవత్సరాల అనుభవం ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ కు పార్టనర్ గా వ్యవహరించడం ఇది మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.

అంతేగాకుండా సుమారు 52 కి పైగా దేశాలనుంచి  552 మంది అంతర్జాతీయ గుర్తింపు వున్న ప్రముఖ ఫోటోగ్రాఫర్లు అమెరికా,. ఇంగ్లాండ్,  ఆస్ట్రేలియా, ఫిన్లాండ్ ,న్యూజిలాండ్, స్వీడన్, హాంగ్ కాంగ్, జపాన్, స్పెయిన్ గ్రీస్, ఇటలీ మొదలైన దేశాలకు చెందిన ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లు ఇప్పటికే  ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్లో అంతర్జాతీయ స్థాయి పేరున్న ఫోటోగ్రాఫర్లు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు.

ఇలాంటి అంతర్జాతీయ స్థాయి ఫోటోగ్రఫి ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్ ,లండన్ ,పారిస్ ,టోక్యో, ఆక్లాండ్ మరియు సిడ్నీ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరాలలో మాత్రమే జరుగుతాయని పేర్కొన్నారు.  అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్ కు ఉన్న గుర్తింపుకు ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీ గా అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 'యూరోపియన్ ఫోటోగ్రఫీ మ్యాగజిన్ ' లో నమోదు కావడం ఇది ఎంతో గర్వకారణం.  అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న 'ద సండే గార్డెన్' పత్రిక కూడా ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ ను ఒక గొప్ప ఫోటోగ్రఫీ ఫెస్టివల్ గా కీర్తించిందన్నారు.

ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ లో సుమారు 2000 మంది అంతర్జాతీయ స్థాయి కలిగిన ఫోటోగ్రాఫర్లు, ఆర్టిస్టులు ప్రపంచవ్యాప్తం నుండి మన హైదరాబాద్ నగరానికి తరలి రావడం ఎంతో గొప్ప విషయంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్ట గా నిలబెడుతుంది. ఈ ఫోటో గ్రాఫ్ ఫెస్టివల్ ద్వారా ఫోటోగ్రాఫర్లు ఫోటో కళా ప్రదర్శనలను ప్రదర్శించడం, సామాజిక అంశాలపై చర్చించడం , ఫోటోగ్రఫీ వర్క్ షాప్స్, పుస్తకావిష్కరణలు మొదలైన కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు ఫోటోగ్రాఫర్లకు అన్ని సదుపాయాలను కల్పించమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ పర్యాటక శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఫోటోగ్రఫీ ఫెస్టివల్లో మన తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, మన బతుకమ్మ, మన బొడ్డెమ్మ, మన నిజాం కాలం నాటి సంస్కృతి, కాకతీయ సంస్కృతి మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న చరిత్ర ఆ వారసత్వ సంపద ప్రపంచానికి తెలిసేవిధంగా ఫొటోగ్రఫీ ఫెస్టివల్ లో పాల్గొనబోయే ఫోటోగ్రాఫర్ల ద్వారా ప్రపంచ వ్యాప్తం కాబోతుంది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తెలంగాణ రాష్ట్రానికి తరలివస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫెస్టివల్ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా తెలంగాణ పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఈ ఫెస్టివల్ లో అంతర్జాతీయ స్పీకర్లు కరోల్ గుజీ, రిచర్డ్ డ్రీ, టిమ్ ఫ్లాక్, అలెక్సా కీఫ్, రేచల్ స్త్రీచర్, అమోఘ వర్షా, జీషన్ లతీఫ్, రఫిక్ సయీద్, హరికృష్ణ కాట్రగడ్డ, సెంథిల్ కుమారన్ లాంటి ప్రముఖ స్పీకర్లు ఈ యొక్క 5 వ ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు.

More Press Releases