నాగలి పట్టి దున్నిన తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం విద్వంసం
  • సమైక్య పాలనలో నిండా మునిగిన రైతాంగం
  • ఆరు సంవత్సరాలనుండి గాడిలోకి
  • సూర్యపేట జిల్లాలో ఘనంగా ఏరువాక పౌర్ణమి సంబురాలు
  • ఆత్మకూర్ యస్ లో 150 నాగళ్లతో పంటపొలాల సాగు
  • నాగలిపట్టి దున్నిన మంత్రి జగదీష్ రెడ్డి
  • ప్రత్యేక ఆకర్షణగా మంత్రి తనయుడు వేమన్ రెడ్డి
సూర్యపేట: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం విద్వంసం అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడ్డాకే విద్వంసం అయిన వ్యవసాయం గాడిలోకి వచ్చిందని ఆయన చెప్పారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతనే కారణమని ఆయన కొనియాడారు.

ఏరువాక పౌర్ణమి సందర్భంగా సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండల కేంద్రంలో రైతులు ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఏకకాలంలో 150 మంది రైతులు పంటపొలాలను సాగు చేసి ఏరువాక పౌర్ణమి సంబురాలు చేసుకున్నారు. స్వయంగా మంత్రి జగదీష్ రెడ్డి నాగలితో పొలం సాగు చెయ్యడం హైలెట్ గా నిలిచింది. ఆయనకు తోడు తనయుడు వేమన్ రెడ్డి నాగలి పట్టి రైతులతో సమానంగా సాగు చెయ్యడం ఇవాళ్టి ఏరువాక పౌర్ణమి ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో రైతును రాజు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రణాళికలు సత్ఫాలితాలు వస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన సమైక్య పాలనలో ఉత్పన్నమైన పరిస్థితులనుండి బయట పడేసేందుకు ఆరు సంవత్సరాలు పట్టింది అన్నారు. అందులో మొదటిగా 24 లక్షల వ్యవసాయపు పంపు సెట్లకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ నందించడం చరిత్రాత్మకమైందన్నారు. దానికి తోడు తొలకరి జల్లుతో అప్పు కోసం రైతు అవస్థలు పడకుండా ఉండే విదంగా రైతుబందు పథకాన్ని అందించారన్నారు.

అంతే గాకుండ ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా సహజ మరణాలకు సైతం భీమా వర్తించేలా రైతుభిమా పథకాన్ని అమలులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. దానికి తోడు కలలో కూడా ఊహించని గోదావరి జలాలు సూర్యపేట జిల్లాకు పారించడం.. కృష్ణా,మూసిలను ప్రణాళిక బద్దంగా వినియోగించుకోవడంతో రైతుల కళ్ళలో ఆనందం వెల్లి విరుస్తుందన్నారు. సమైక్య పాలనలో గోదావరి పై ప్రాజెక్ట్ కట్టే ఆలోచన కూడా అప్పుడు పాలకులు చేసిన పాపాన పోలేదన్నారు.

అటువంటి దుర్భర పరిస్థితుల్లో రైతాంగం ఉన్నందునే తొలకరి జల్లు పడగానే చేసుకోవాకల్సిన ఏరువాక పౌర్ణమి కి దూరమయ్యారని చెప్పారు. అటువంటి పరిస్థితులు అధిగమించి వ్యవసాయం మీద విశ్వాసం పెరిగినందునే రైతులు ఈ రోజు చేసుకుంటున్న సంబురాలకు నిదర్శనమన్నారు. అయినా ఇంకా సంతృప్తి చెందని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించుకునే విదంగా నియంత్రిత సాగును అమలులోకి తెస్తున్నారన్నారు. అందుకు గాను రైతులను సంఘటితం చెయ్యడంతో పాటు ప్రపంచ దేశాల అవసరాలను గుర్తించి ఏ ఏ పంటలు ఎప్పుడెప్పుడు వెయ్యాలి అన్న చైతన్యం తెచ్చేందుకు నియంత్రిత సాగును ముందు పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు.

డిమాండ్ ఉన్న పంటలు వేసినప్పుడే మార్కెటింగ్ సులబతరమౌతుందని.. అప్పుడే ధరను రైతు నిర్ణయించ వచ్చని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు మాంసాన్ని ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న మనం రాష్ట్రం ఏర్పడ్డాక ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాంసంకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తే చాలా మంది పెదవులు విరిచారని, నవ్విన నాప చెను పండిన చందంగా ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి వచ్చి నవ్విన వారికి చెంప పెట్టులాంటి సమాధానం ఇచ్చారన్నారు.

అదే విదంగా ఇప్పటికి మనం మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్, బెంగుళూర్, చిత్తూరు జిల్లా మదనపల్లి, గోదావరి జిల్లాల నుండి కూరగాయలు దిగుమతులు చేసుకుంటున్నామని అందుకు భిన్నంగా మనమే కూరగాయల సాగుపై దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు రాబట్టోచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్న కంది పంటపై రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్ పి వైస్ ఛైర్మన్ వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases