నంద్యాల వారి గూడెంలో నియంత్రిత సాగుపై రైతులతో మంత్రి జగదీష్ రెడ్డి ముఖాముఖి

Related image

సూర్యాపేట: "ఎంత పెట్టుబడి పెడుతున్నారు.. ఏ ఏ పంటలు వేస్తున్నారు.. ఇప్పుడు ఏమి వెయ్యాలి అనుకుంటున్నారు.. అంతర్ పంటల మాటేమిటి.. పత్తి వేసిన చోట మినుము మినుము వేసిన చోట పత్తి వేస్తున్నారా.. పంటలు మార్చాలని అనుకుంటున్నారా.. కందికి నీళ్లు కడుతున్నారా.. కాలువలు తీస్తే పూడి పోయాయా.. పొడు చేసిందంతా లెక్క కరెక్ట్ గా ఉందా అప్పుడు తీసినట్లే ఇప్పుడు తీస్తే లెక్క కుదురుతుందా అధికారులను పంపిస్తా యధావిధిగా కాలువలు తవ్వాలి.." అన్న ప్రశ్నలతో రైతు బిడ్డగా.. రైతుల్లో ఒకరిగా.. స్వయంగా వ్యవసాయంపై ఉన్న స్వీయ అనుభవంతో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం నియంత్రిత సాగుపై జరిపిన సంభాషణలో ప్రశ్నల వర్షం కురిపించారు.

నియంత్రిత సాగుపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు గాను మొదట జిల్లా స్థాయిలో ఆ తరువాత నియోజకవర్గ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి తాజాగా గ్రామాల్లో రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో బాగంగా సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ యస్ మండలం నంద్యాలవారిగూడెంలో మంగళవారం మధ్యాహ్నం రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ అడిగిన ప్రశ్నల పరంపరకు మంత్ర ముగ్దులైన రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్న నియంత్రిత సాగులో భాగస్వామ్యం అవుతామంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.పంటల మార్పిడి తో పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకోవచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో కందికి రంది లేదని, సోయాబీన్ కు మంచి డిమాండ్ ఉందని ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి రైతులకు వివరించారు. ఫామాయిల్ వంటి పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే అందుకు అనుగుణంగా ఆయిల్ తయారు చేసే కర్మాగారం పెట్టించడం సులబమేనని ఆయన తెలిపారు. చౌట భూముల్లోనూ లాబాదయక పంటలు ఏ రకంగా పండించవచ్చో అన్నది ఉదాహరణలతో వివరించిన ఆయన పంటల డిమాండ్ ను పట్టే మార్కెట్లు కళ్లల దగ్గరికి వస్తాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం కూడా అదే నని అందుకు రైతులను సంఘటితం చేసేందుకే ఈ అవగాహన సదస్సులు అని వివరించారు. ఈ వానాకాలంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని.. మరో 15 రోజుల్లో నీరు విడుదల ఉంటుందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ జిల్లా గ్రంధాలయా సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జిల్లా ప్రజాపరిషత్ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases