ప్రత్యేక హోదా - విభజన హామీలకు జగన్ సర్కార్ అన్యాయం చేసినట్టేనా?.. మేడా శ్రీనివాస్

Related image

  • ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని 13 జిల్లాల అభివృద్ధి లక్ష్యం గా ప్రజలు ఉద్యమించాలి
  • ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆంధ్రుల ఆవేదనతో నిరసన దీక్ష
జూన్ 2వ తేది ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్బంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రత్యేక హోదా ఆత్మ గౌరవ పోరాట కమిటి వ్యవస్థాపక కో- ఆర్డినేటర్ మేడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒక్క రోజు నిరసన దీక్ష  చేపట్టారు.

మేడా మాట్లాడుతు.. "కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు పార్లమెంట్ సాక్షిగా ఇద్దరు ప్రధానులు ఏపీకి జరిగిన ఆర్ధిక నష్టాన్ని ప్రత్యేక హోదా తరగతితో పాటుగా రాయితీలతో కూడిన విభజన హామీలను అమలు చేసి ఏపీకు జరిగిన ఆర్ధిక నష్టాన్ని భర్తి చేస్తాం అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కేంద్ర (మోది)ప్రభుత్వం నమ్మించి మోసగించారు అని, 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తోపాటుగా విభజన హామీలను సాధించాము, పరిశ్రమలతో ఇక ఏపీ స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఊరు వాడ చంద్రబాబు నమ్మించి ఏపీ ప్రజలను పచ్చిగా మోసం చేశారు.
 
ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో చంద్రబాబు మోసం చేశారు నేను సాధించి ఆంధ్రప్రదేశ్ ను బంగారు ఆంధ్రప్రదేశ్ గా నిర్మిస్తాను అని జగన్ మోహన్ రెడ్డి మరోసారి నమ్మించి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసగిస్తే ప్రస్తుత అధికార పక్షానికి చెందిన మా ఎంపీలు అందరు రాజీనామాలు చేస్తారని తొలి సమావేశంలోనే జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించి ఏపీ ప్రజలను తారా స్థాయిలో నమ్మించారని, ఇప్పుడు మోది గారికి మన అవసరం లేదు కాబట్టి హోదా సాధ్యం కాదు అన్నట్టుగా జగన్ మాట్లాడటం చంద్రబాబును మించిన ద్రోహంగా భావించాలి.

రాష్ట్ర విభజన జరిగి 6 ఏళ్ళు పూర్తి కావొస్తున్నా ఏపీకి ఏ ఒక్క ప్రాజెక్ట్ రాకపోగా పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ ముందుకు సాగనివ్వటం లేదు అని, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని అని ప్రపంచం అంతా నమ్మించి నేడు అమరావతి అభివృద్ధి ని నిర్వీర్యం చేస్తున్నారు. ఒక్క రాజధాని నిర్మాణంలో సామర్ధ్యతను నిరూపించుకోవటం చేతకాని ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానులు నిర్మిస్తాను అని విశాఖపట్నం, అమరావతి, కర్నూల్ ప్రాంతాల ప్రజల మధ్య ప్రాంతీయ చిచ్చుకు ఆజ్యం పోస్తున్నారు.

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో  జగన్ రాగ ద్వేషాలను విడిచి పెట్టి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన పై ద్రుష్టి సారించాలని, హోదా విషయంలో చంద్రబాబు మోసం చేస్తే జగన్ పాపం చేస్తున్నారని, ఏపీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆంధ్రులు మోసపోయిన వైనం గుర్తుకు తెచ్చుకుని 6 ఏళ్ళు గా జూన్ 2 వ తేదీనాడు కుమిలి కుమిలి ఆత్మ ఘోష తో ఆత్మ గౌరవ పోరాటం చేస్తూనే వుంటున్నారని, ఇక ఆంధ్రుల వంతు మోస పోవటం కాదని నిరూపించాలని,  కేసీఆర్ మాయలో పడి ఆంధ్రప్రదేశ్ దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం చేయొద్దని" ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశిస్తు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ నిరసన దీక్షలో ప్రసంగిచారు.

డిమాండ్స్:

(1) ముఖ్యమంత్రి అధికారికంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
(2)ఆంధ్రప్రదేశ్ లో గల అన్ని రాజకీయ పార్టీలను, ఉద్యమ సంస్థలను ప్రధాని మోది వద్దకు ముఖ్యమంత్రి జగన్ తీసుకెళ్లి ప్రత్యేక హోదా విభజన హామీలు కోసం తెలియ చేయాలి.
(3)పోలవరం ప్రాజెక్ట్ పనులును  యుద్ధ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి.
(5)మూడు రాజధానుల ప్రకటన ను జగన్  ఉపసంహరించుకుని 13 జిల్లాల అభివృద్ధి ని చేపట్టాలి.
(6)ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కై జగన్ సర్కార్ కూడా అసెంబ్లీ లో మరో తీర్మానం చేసి ప్రధాని మోది కి పంపించాలి.
(7)ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్రం ప్రకటించే వరకు జగన్  పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ బయట, లోపల నిరసనలు తెలపాలి.

నిరసన దీక్షలో మేడా శ్రీనివాస్ తో పాటుగా సార్వశ్రీ పెండ్యాల కామరాజు, డి వి రమణ మూర్తి, లంక దుర్గా ప్రసాద్, కొల్లేపల్లి లక్ష్మణరావు, కే. అనంతలక్ష్మి, వరి వరలక్ష్మి, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డె సురేష్, ఇల్లా రాము, కప్పల రాజు, మోర్త ప్రభాకర్, బర్ల ప్రసాద్, సత్తి వెంకట రెడ్డి, మాసా అప్పాయమ్మ, కారుమూరి రామచంద్రుడు, బు సిం సత్యనారాయణ, ఎమ్ డి హుస్సేన్, సిమ్మా దుర్గారావు, ఈ. నాగ శైలజ, ద్వాదశి శ్రీను, బర్ల సతీష్, దోషి నిషాంత్ వార్లు దీక్షలో పాల్గొన్నారు.

More Press Releases