TTD: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశ్వ ధర్మ..
Add ap7am to your home Screen

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అభినందనలు

టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక అభినందనలు
  • టీటీడీ నిర్ణయంతో హిందువులకు భరోసా
తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ఆస్తులను విక్రయించరాదని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు అభినందించారు. సోమవారం తాడేపల్లిలోని వైవీ సుబ్బారెడ్డి నివాసంలో శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామి ఆధ్వర్యంలోని విశ్వ ధర్మ పరిరక్షణ వేదిక సభ్యులు సుబ్బారెడ్డిని కలిశారు.

టీటీడీ విషయంలో అద్భుతమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అభినందిస్తూ రజిత కిరీటంతో ఘనంగా సన్మానించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం హిందూ ధర్మానికి అండగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించే విధంగా భరోసా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సుబ్బారెడ్డిని సన్మానించిన వారిలో శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి, శ్రీ యోగేశ్వర నంద స్వామి, శ్రీ ఆది పరాశక్తి నంద స్వామి, శ్రీ భవాని శంకరానంద స్వామి, శ్రీహరి నంద స్వామి తదితరులున్నారు.
TTD
Tirumala
Tirupati
YV Subba Reddy

Watch Today's Deals on Amazon

More Press News