కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకోవడం పై సమగ్ర నివేదిక రూపొందించండి: మంత్రి తలసాని

Related image

కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకోవడం పై సమగ్ర నివేదిక రూపొందించాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం సమగ్ర నివేదికలతో డిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, ఇతర అధికారులను కలిసి నిధుల మంజూరుకు కృషి చేద్దామని అన్నారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డెయిరీ MD శ్రీనివాస రావు,, పశు గాణాభి వృద్ది సంస్థ CEO మంజువాణి లతో ఆయా శాఖల కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించారు.

ఈ సంవత్సరం కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 24 వేల వివిధ నీటి వనరులలో సుమారు 88 వేల చేప పిల్లలు అవసరం ఉంటుందని, చేపపిల్లల కొనుగోలు కోసం టెండర్ల ప్రక్రియ ను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. NFDB సహకారంతో ఏర్పాటు చేయనున్న ఫిష్ ఔట్ లెట్ నమూనా లు 2 రోజులలో సిద్ధం కానున్నాయని, వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.

పశుసంవర్ధక శాఖ కార్యక్రమాల పై సమీక్ష సందర్బంగా మాట్లాడుతూ జిల్లాల లో 1962 సంచార పశువైద్య శాలల పనితీరును సమీక్షించాలని, ఆకస్మిక తనిఖీలు సైతం నిర్వహించాలని ఆదేశించారు. మాంసం సరఫరా, విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ జరపాలని, ధరలు నియంత్రణలో ఉండే విధంగా చూడాలని అన్నారు. 33 జిల్లా లలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు పశుగణాభివృద్ది సంస్థ పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కమిటీల ఎన్నికకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని TSLDA CEO మంజువాణి ని ఆదేశించారు.

విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను మరింతగా పెంచేందుకు నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని, వారం రోజులలోగా అందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని డెయిరీ MD శ్రీనివాస రావును ఆదేశించారు. లాక్ డౌన్, వేసవి నేపద్యంలో పాల సేకరణ, సరఫరా పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 

More Press Releases