మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇచ్చే నీరు మినరల్ వాటర్ కంటే శుద్ధి అయిన నీరు: మంత్రి సత్యవతి రాథోడ్

Related image

రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రారంభించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా నేడు మహబూబాబాద్, గార్లలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, కలెక్టర్ గౌతమ్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్:

  • మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇచ్చే నీరు మినరల్ వాటర్ కంటే శుద్ధి అయిన నీరు
  • గతంలో ట్యాంక్ లు కడుక్కోకపోయినా ఇపుడు వారానికి ఒకసారి కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి
  • ప్రతి ఇంటికి తాగి నీరు వచ్చేలా కలెక్టర్ గారు చూస్తారు
  • మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సి.హెచ్. సీకి తరలించి త్వరలో ప్రారంభిస్తాం
  • కరోనా సమయంలో పేదలకు, వలస కూలీలకు రేషన్ బియ్యం, డబ్బులు ఇచ్చి గొప్పగా ఆదుకున్న చరిత్ర మన సీఎం కేసీఆర్ ది
  • కరోనా వల్ల దేశమంతా అతలాకుతలం అవుతుంది. ఈ వ్యాధి ఇక్కడ పుట్టింది కాదు. దీనికి మందు లేదు. భౌతిక దూరం పాటించాలి
  • ఇక్కడ గతంలో డెంగ్యూ, సీజనల్ వ్యాధులతో ఎక్కువగా చనిపోయారు. ఎవరూ పట్టించుకోక చనిపోతున్నారని జడ్పీ చైర్ పర్సన్ ఏడ్చారు కూడా
  • కాబట్టి ఈసారి ఆ పరిస్థితి రాకుండా మనం మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
  • కరోనా వైరస్ కట్టడికి అమలు చేసిన లాక్ డౌన్ వల్ల  ప్రభుత్వానికి ఆదాయం లేకున్నా..రైతులకు రైతు బంధు కు వెయ్యి కోట్లు పెంచి 7000 కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, 25,000 రూపాయలు బ్యాంక్ లోన్ ఉన్న వారి రుణ మాఫీకోసం 1200 కోట్ల రూపాయలు ఇచ్చారు
  • నిధులు ఎప్పుడు వచ్చినా సరే ముందుగా గార్ల మండలానికి 18 కోట్లు ఇస్తాం. బయ్యారానికి ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే ఖర్చు చేస్తాం. ఈ రెండు మండలాలకు నిధులు ఎక్కువ ఇస్తాం అని ముఖ్యమంత్రి గారు అన్నారు
  • రానున్న సీజన్లో గార్ల మండలంలో డెంగ్యూ వలనో, ఇతర సీజనల్ వ్యాధుల వలనో ఏ ఒక్కరి ప్రాణాలు పోకుండా చూస్తాం
  • జిల్లాలోనే గార్ల మండలనికి స్పెషల్ టీమ్ పెట్టి మంచి వైద్యం అందేలా అలాగే ప్రజలను పరిశుభ్రంగా ఉండడంతో  భాగస్వాములను చేస్తాం
  • కరోనా విషయంలో ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
  • అనంతరం హాస్పిటల్ సందర్శించి అక్కడి పరిస్థితులు పర్యవేక్షించారు.ఇక్కడకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలన్నారు

More Press Releases