తెలంగాణ సీఎస్ ఎస్.కె. జోషితో హాంకాంగ్ ప్రతినిధుల బృందం సమావేశం!

Related image

హైదరాబాద్ నగరానికి సంబంధించి రోడ్లు, పార్కులు, లేక్స్, రవాణ తదితర రంగాల అభివృద్ధికి సంబంధించిన ఆర్కిటెక్చర్ డిజైన్ లను అందించాలని AECOM ప్రతినిధులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి కోరారు. శుక్రవారం సచివాలయంలో హాంకాంగ్ కు చెందిన AECOM ఆసియా ఫసిఫిక్ ప్రెసిడెంట్ Sean C.S Chiao, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ Nancylin, AA లు కలిసారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి చారిత్రాత్మక నేపథ్యం ఉందని మంచి వాతావరణంతో ఐటి హబ్ గా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. పట్టణ రంగానికి సంబంధించిన సలహాలు, ఇన్ స్టిట్యూషనల్ రిఫామ్స్ కు సూచనలు, శిక్షణ కార్యక్రమాలు అందించాలని కోరారు.

మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ AECOM సంస్ధ నగరాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ డిజైన్ లో అనుభవం పొందిందని వారి సలహాలు కోరుతున్నట్లు తెలిపారు. AECOM ప్రెసిడెంట్ Sean C.S Chiao, మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని వివిధ ప్రాంతాలు సందర్శించామని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి డిజైన్ లను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డిజైన్ ప్లానింగ్, సిటి డెవలప్ మెంట్, ట్రాఫిక్ మేనేజ్ మెంట్, జాబ్స్ జనరేషన్, లేక్ బ్యూటిఫికేషన్, సివిల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ డిజైన్, ట్రాన్స్ పోర్టేషన్ తదితర అంశాలకు సంబంధించి చర్చించారు.

More Press Releases